13, ఫిబ్రవరి 2012, సోమవారం


ప్రభుత్వ పాలనపై గవర్నర్ ప్రసంశ
సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పాలన భేష్గా ఉందని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రసంశించారు. 35 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తుండటంతో తన ప్రసంగాన్ని గవర్నర్ జెట్ స్పీడ్తో ముగించారుబడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన హింస అదుపులో ఉందని చెప్పారు. 2015 నాటికి మాతా, శిశు మరణాలు తగ్గిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, పేదరిక నిర్మూలనకు ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై ముందుకు నడిపించాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని గవర్నర్ కోరారు. హైదరాబాదుకు కృష్ణా, గోదావరి నీళ్లు హైదరాబాదుకు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
----------------------------------------
ఇది మొక్కుబడి ప్రసంగం: జెపి
అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం కేవలం మొక్కుబడిగా సాగిందని లోక్సత్తా అధ్యక్షుడు, కూకట్పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ  అన్నారు. గవర్నర్ ప్రసంగంపై జెపి అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారువాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పించి అవినీతిపై చర్చ లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. అవినీతి మంత్రులు, అధికారులపై ఏమీ మాట్లాడలేదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు దాచాలని చూసినా దాగవన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేనందున తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసనగా ప్రసంగాన్ని బహిష్కరించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ తదితర పార్టీలు గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

  మార్చి 29వరకు అసెంబ్లీ - 17 బడ్జెట్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 29 తేదీ వరకు కొనసాగుతాయి.  29 రోజుల పాటు సమావేశాలు జరుగనుండగా, 16 రోజులు సెలవులుంటాయి శాసనసభ బీఏసీ సమావేశంలో నెల 17 రాష్ట్ర బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాల్సిందిగా టియారెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ అంశం మన పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని కిరణ్ స్పష్టం చేశారు.
       --------------------------------------------------------
మిమిక్రీ ఆర్టిస్టులా మారిన చంద్రబాబు: లక్ష్మీపార్వతి
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మిమిక్రీ ఆర్టిస్టులా మారిపోయారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి విమర్శించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో చేస్తున్న దీక్షకు ఆమె మద్దతు ప్రకటించారు. అన్నా హజారే అవినీతిపై ఢిల్లీలో పోరాటం చేస్తే చంద్రబాబు ఇక్కడ చేశారని, జగన్ విద్యార్థుల కోసం, చేనేత కార్మికుల కోసం, రైతుల కోసం దీక్ష చేస్తుంటే బాబు ఆయన దారిలో నడుస్తున్నారని ఇలా ఎవరు దీక్షలు చేసినా చంద్రబాబు వాటిని అనుసరిస్తూ మిమిక్రీ ఆర్టిస్టులా మారిపోయారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 200 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. పరిహారం ఇస్తే ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పిన ప్రబుద్దుడు బాబు అని ధ్వజమెత్తారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేనేత కార్మికులను ఆదుకున్నారన్నారు. వ్యవసాయం తర్వాత చేనేతకు దేశంలో ప్రాధాన్యత ఉందని, ఎన్టీఆర్, వైయస్ తర్వాత ప్రజా సమస్యలపై ఎవరైనా స్పందించారా అని ప్రశ్నించారు. జగన్ మాత్రమే వారి దారిలో నడుస్తున్నారన్నారు. బాబు హయాంలో చేనేత రంగం ఎంతగా క్షీణించిందో అందరికీ తెలుసునన్నారు
 -------------------------------------------------------------
ఈసికి జగన్ వర్గం లేఖ
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశింది జగన్ వర్గం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ అన్ని స్థానాలకూ ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని తాము ఈసికి లేఖ రాసినట్లు చెప్పారు. తాము అసెంబ్లీలో వైయస్సార్ సిఎల్పీగా పని చేస్తామన్నారుసభలో ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.   తెలంగాణలో ఆరు నియోజకవర్గాలు, సీమాంధ్ర ప్రాంతంలోఒకేసారి ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం కష్టమనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు మొదట తెలంగాణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటుందికాంగ్రెసు వ్యూహంపై దెబ్బ కొట్టాలనే భావనతో వైయస్సార్ కాంగ్రెసు అన్ని నియోజకవర్గాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసికి లేఖ రాసింది.
---------------------------------
హీనాకు ఫోన్: చిక్కుల్లో భారతీయుడు
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్కు ఓ భారతీయ యువకుడి సెల్ ఫోన్ నుండి కాల్ వెళ్లడం అతనిని ఇబ్బందుల్లోకి నెట్టింది. యువకుడు రాయచూర్ జిల్లా సింధనూర్ తాలుక రిమోట్ బుద్దిని గ్రామానికి చెందిన వ్యక్తి సిసిబి అధికారులు బెంగళూరు నుండు వెళ్లి విచారించడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. హీనాకు వచ్చిన కాల్పై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ కార్యాలయం మన ప్రభుత్వానికి తెలియజేసి విచారణ చేయాల్సిందిగా కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిసిబి అధికారులు విచారణ జరుపుతున్నారు. హీనాకు ఫోన్ చేసిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు  ఉన్నాయి. ఘటన రెండు నెలల క్రితం జరింగింది. అయితే యువకుడు ee ఆరోపణలు ఖండిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆ  యువకుడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వద్ద అటెండర్గా పని చేస్తున్నాడు. తాను ఇప్పటి వరకు రబ్బాని ఖర్ పేరు వినలేదని, తనకు ఆమెతో మాట్లాడేందుకు ఇంగ్లీషు కానీ ఉర్దూ కానీ రాదని, అలాంటప్పుడు ఆమెకు తాను ఫోన్ చేసి ఎలా మాట్లాడతానని ఆవేదనతో చెప్పాడు. అయితే తన ఫోన్ను మరెవరైనా ఉపయోగించారో తనకు తెలియదన్నాడు
-------------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి