యూపీలో
మందకొడిగా పోలింగ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వర్షం కారణంగా పోలింగ్ ప్రారంభమయిన తొలి రెండు గంటల్లో కేవలం 5.17 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి.
పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయింది, తొలి రెండు గంటల్లో 5.17 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో గల 55 అసెంబ్లీ సీట్లకు ప్రస్తుతం తొలి ధపా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా చెప్పారు.
సిద్దార్ధ నగర్ జిల్లాలోని బన్సీ అసెంబ్లీ సీటుకయితే, పోలింగ్ ప్రారంభమయిన తొలి రెండు గంటల వరకు కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. సీతాపూర్ ప్రాంతంలో 5.1 శాతం నమోదయింది. మిస్రిఖ్ నియోజకవర్గంలోని గులారియా గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడటమే ఇందుకు కారణమని వారు వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లాలో 3.5శాతం, బహ్రైచ్ ప్రాంతంలో 4 శాతం పోలింగ్ నమోదయింది. అయితే, బారాబంకీ జిల్లాలో అయితే ఉదయం 10 గంటల నాటికి గరిష్టంగా 16 శాతం పోలింగ్ నమోదయింది. ప్రస్తుతం సీతాపూర్, బారాబంకీ, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, బహ్రైచ్, శ్రావస్తి తదితర పది జిల్లాల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. 1.70 లక్షలకు మించిన ఎలక్టోరేట్లలో 952.87 లక్షల పురుషులు, 70.44 లక్షల మహిళలు 862 మంది అభ్యర్ధుల తలరాతను నిర్ణయించనున్నారు. ఈ అభ్యర్ధుల్లో అత్యధికంగా 796 మంది పురుషులుండగా, మహిళల సంఖ్య కేవలం 65 మాత్రమే. ఈ ఎన్నికల్లో ఒక హిజ్రా అభ్యర్థి కూడా పోటీ చేస్తుండటం విశేషం.
---------------------------------------------------
బాబుకు
ఆ హక్కు లేదు!
రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనను విమర్శించే హక్కు లేదని మంత్రి రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ విచారణ పూరైన తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని రఘువీరా రెడ్డి అన్నారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ విచారణతో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని ఆయన అన్నారు
తప్పు మంత్రులదో ఐఏఎస్ అధికారులదో త్వరలోనే బయట పడతాయని,,, ఏదిఏమైనప్పటికీ ఏసీబీ విచారణ పూరైన తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
'నా ఇష్టం' డబ్బింగ్ పూర్తి
దగ్గుబాటి రానా, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం 'నా ఇష్టం'. ప్రకాష్ తోలేటి దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. యునైటెడ్
మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో అతి త్వరలో చిత్ర యూనిట్ మలేషియాకి వెళ్ళనుంది. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'నా ఇష్టం' చిత్ర వివరాలను నిర్మాత పరుచూరి కిరీటి వెల్లడించారు. కిరీటి మాట్లాడుతూ...ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేసుకుంది. మిగతా అన్ని కార్యక్రమాలను అతి త్వరలో పూర్తి చేసి ఈ ఫీల్‌గుడ్ మూవీని మార్చి ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు
రానా, జెనీలియా, బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతిప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి