మంత్రుల మెడకు ఉచ్చు బిగిస్తున్న జగన్ వర్గం
సిబిఐ
దర్యాప్తులో ఐఎఎస్ లకు, రాజకీయ నాయకులకు మధ్య
ఏర్పడిన యుద్ధవాతావరణాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో
వైయస్
రాజశేఖర రెడ్డి మంత్రి
వర్గంలో పనిచేసిన కొందరు మంత్రులపైకి సిబిఐ
దర్యాప్తును మళ్లించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
నాయకులు, ఆయన వర్గానికి చెందిన
కాంగ్రెసు శాసనసభ్యులు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు . వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో
కీలక పాత్ర పోషించిన ఐఎఎస్
అధికారులు కొందరిని సిబిఐ అరెస్టు చేయడం,
మరికొందారిని విచారిస్తుండడం చర్చనీయంశామైంది . ఎమ్మార్, వైయస్
జగన్, గాలి జనార్దన్ రెడ్డి
కేసుల్లో సిబిఐ కొంత
మంది రాజకీయ నాయకులను సాక్షులుగా విచారించింది. కానీ,
వారిని నిందితులుగా చేర్చకపోవడమే కాకుండా వారిని
అరెస్టు కూడా చేయడం
లేదనే వాదనను బలంగా
ముందుకు తెస్తున్నారు. జరిగిన
పొరపాట్లకు మంత్రివర్గ సభ్యులను బాధ్యులను చేయాలనే వాదన
జగన్ వర్గం నుంచి
వస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి
మంత్రి వర్గంలో పనిచేసి
ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి మంత్రి
వర్గంలో పనిచేస్తున్నవారిని ఇరకాటంలోకి నెట్టే
ప్రయత్నం చేస్తోంది.. బొత్స
సత్యనారాయణ, గీతా రెడ్డి,
సబితా ఇంద్రా రెడ్డి
తదితర మంత్రుల పాత్ర
వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో జరిగిన
నిర్ణయాల్లో ఉందనే వాదన
వినిపిస్తోంది.
గాలి జనార్దన్ రెడ్డి
అక్రమ మైనింగ్ కేసులో
సబితా ఇంద్రారెడ్డి ప్రతిపక్షాల నుంచి
తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నిర్ణయాల్లో మంత్రుల సమిష్టి బాధ్యత
ఉంటుందని, అయితే దాని
అమలు విషయంలో ఉండదని
పిసిసి అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ వంటివారు అంటున్నారు.
ఐఎఎస్ అధికారుల వాదనకు
అంతగా మద్దతు లభించకపోయినప్పటికీ రాజకీయ
నాయకులను వదలకూడదనే వాదనకు
బలం చేకూరుతుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా
చంద్రబాబు నాయుడిని కూడా
కాంగ్రెసు పార్టీ కాపాడే
ప్రయత్నం చేస్తోందని, సిబిఐ
అందుకే చంద్రబాబును వదిలేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
నాయకులు అంటున్నారు.
ఇప్పటి వరకూ కేవలం రాజశేఖరరెడ్డి నే దోషిగా చిత్రీకరించడానికి వ్యూహరచన
చేసిన సిబిఐ ఇకపై అప్పటి మంత్రులపై కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి
ఏర్పడింది. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ సిబిఐ ని కూడా ఇరకాటంలో
పడేస్తున్నట్టు కొందరి వాదన. ఏదిఏ మైనా .. ఇటు కాంగ్రెస్ అటు టిడిపి జగన్
ను ఇరికి౦చబోయి తామే ఇరుక్కున్నట్టయింది..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి