దివంగత రాజశేఖర రెడ్డిని అప్రదిష్ట పాలు చేయాలన్న కాంగ్రెస్ వర్గాల ప్రయత్నం బెడిసికొట్టినట్లు కనబడుతోంది. జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ.. అటు ప్రధాన ప్రతిపక్షం పోటీపడి మరీ సిబిఐ విచారణ కోసం ప్రయత్నిoచాయి. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాల్సి వచ్చేసరికి పాత పద్ధతిలోనే కోర్టును ఆశ్రయించి స్టే తేచ్చుకున్నారు. ఇందుకు పరోక్షంగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏదైతేనేం.. సిబిఐ తవ్వి తీస్తున్న నిజాల నిగ్గు తేలుతున్న తీరు చూస్తే ... తాము తవ్విన గోతిలో టిడిపి.., కాంగ్రెస్ లు పడ్డాయనే విషయం అర్ధమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంచితనాన్ని, ఉదార స్వభావాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన మంత్రులు..ఐఏఎస్ లు ఇప్పుడు కలుగుల్లోని ఎలుకల్లా బయటకొస్తున్నారు. మేము చిన్న చేపలమే అంటూ ఐఏఎస్ లు వెల్లడించిన ప్రకటన పెద్దచేపలు ఉన్నారనే నిజాన్ని బహిర్గతం చేసింది. ఈ ప్రకటన వెలువడగానే ప్రస్తుత మంత్రులు.. మాజీ మంత్రులు కొందరు భుజాలు తడుముకోవడం బహిరంగ రహస్యమే..! దీంతో ఏంతో కొంత అవినీతి జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. సుమారు 20 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం దక్కి.. కుదురైన ప్రభుత్వం ఏర్పడడంతో గాదెకింద పందికొక్కుల్లా కొందరు తెగ మేయడానికి తెగబడ్డారు. కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నఏకైక లక్ష్యంతో రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి పార్టీని బతికించిన మాట నిజం. ఆయన అందరినీ కలుపుకు పోవాలనే తలంపుతో ఏఒక్కరినీ దూరంచేసుకోలేకపోయారు. కేవలం తన సహచారులనుకున్న వారినే చేరదీశారనే అపవాదు రాకూడని భావించి తన వ్యతిరేకులను కూడా సమాదరించారు. వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చారు. అయినా... ఆయనపై అలిగి అధిష్టానానికి ఫిర్యాదులు మోసినవారి వివరాలు వైఎస్ కు తెలియకపోలేదు. వారినికూడా ప్రసన్నం చేసుకోవడానికే ఆయన ప్రయత్ని౦చారు. ఈ రాజకీయ సమీకరణాల రగడలో ఆయన కుర్చికే గోతులు తవ్వడం ప్రారంభమైంది. ఆ నేపధ్యంలోనే అవినీతి సామ్రాట్టులు జూలు విదిల్చారు. ఆయన బతికివుంటే ఇలాంటి బాగోతాలను కట్టడిచేసి ఉండేవారేమో..? విధి వక్రించి ఆయన హఠాన్మరణంతో.. అప్పటివరకూ చాపకింద నీరులా ఉన్న అసమ్మతి బరితేగించి౦ది. పాపల భైరవుడు మరణించిన నాయకుడేనని ప్రచారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని భుజానేసుకునే వారికి కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్సులు అందచేసింది. అప్పటికీ కసితీరని కొందరు దివంగత నేతపై కేసులకు తెరతీశారు. ఇదంతా ఒకఎతైతే..ఇప్పుడు సిబిఐ నిర్వాకం కాంగ్రెస్ నే ఇరకాటంలో పడేసింది. జగన్ రాజకీయ భవిష్యత్తును దేబ్బతీయడంతోపాటు... రాజశేఖరరెడ్డి ఆనవాళ్ళను రాష్ట్రంలో సమూలంగా తుడిచేసే లక్ష్యంతో ఇటు అధికార పక్షం,, అటు ప్రధాన ప్రతిపక్షం సిబిఐ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. తెరచాటున టిడిపి మాజీ మంత్రి,, సిబిఐ మాజీ ఉన్నతాధికారి కేసుల బాగోతాన్ని పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏరోజుకారోజు సిబిఐ విచారణా౦శాలు బహిర్గతం కావడం వెనక మతలబు ఇదేనని కొందరి వాదన. సిబిఐ డైరెక్టర్ లక్ష్మినారాయణ మాత్రం తాను లీకువీరుణ్ణి కాదంటూ ఇటీవల ఓ ప్రకటన చేసి తన బాధ్యత తీరినట్టు భ్రమి౦పచేశారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే... సదరు లక్ష్హినారాయణ వ్యవహార శైలి పైనే పలు అనుమానాలు.., అపార్ధాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ఐఏఎస్ లు అయితే.. తమ విషయంలో సిబిఐ అధికారులు వ్యావహరిస్తున్నతీరు.. నిస్సందేహంగా సహేతుకం కాదని తేల్చి చెబుతున్నారు. అ౦తేకానీ... తాము తప్పు చేయలేదని లేదా తాము నిర్దొషులమని అనడంలేదు. తమతోపాటు ప్రజాధనం భోంచేసిన నేతలను వదిలేస్తున్నరేం..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మేతలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. ఐఏఎస్ ల నిజాయితిని ఈ విషయంలో ఒప్పుకుని తీరాలి. తాము కూడా దొడ్డిదోవన ప్రజాధనం కొల్లగోట్టామని బహిరంగంగా చెప్పడం నిజంగా సాహసమేకదా..? ఐఏఎస్ ల ప్రకటనలతో నాయకుల ప్రమేయం బయటకొచ్చింది. కేవలం కాంగ్రీస్ మాత్రమేకాదు.. టిడిపి గొంతులోనూ పచ్చి వెలక్కాయి పడ్డట్టయింది. వారి బాగోతమూ బయటకొచ్చే ప్రమాదం కనబడుతోంది. అదీగాక.. ఐఏఎస్ లు అలక వహిస్తే రాష్ట్ర ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. అయ్యవార్ల తీరు చూసి కింది స్థాయి అధికారగణం మరింత చేతివాటం చూపడం ఖాయం. ఐఏఎస్ లే ఆమ్యామ్యాలు తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేసినప్పుడు తాము సామాన్యుడిని పిండుకుతింటే తప్పేంటని పెట్రేగిపోయే ప్రమాదము ఉంది. సిబిఐ విచారణ వల్ల ఏతా వాతా కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడటమే కాక.. ఆపార్టీ నేతల బాగోతాలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారు పడడం అంటే ఇదేనేమో...?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి